![]() |
| alia bhatt |
ఎవరైనా బాత్రూంను ఎందుకు ఉపయోగిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే బాత్రూంలో నిద్రపోయేవాళ్లను ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి ఉదంతాల గురించి విన్నారా..? తాను ఆ కోవకు చెందిన అమ్మాయినే అంటోంది బాలీవుడ్ భామ ఆలియా భట్. ఇది ఆమె స్కూల్లో చదువుకునే రోజుల్లో సంగతట. పాఠశాలకు వెళ్తే తనకు తనకు నిద్ర వచ్చేసేదని.. దీంతో ఎవరికీ కనిపించకుండా వెళ్లి బాత్రూంలో నిద్రపోయేదాన్నని ఆమె వెల్లడించింది.
''నేను పాఠశాలకు వెళ్లి.. బాత్రూంలో నిద్రపోయేదాన్ని. ఒక రోజు తరగతి గదిలో నేను కనిపించకపోవడంతో ఓ టీచర్కు అనుమానం వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. బాత్రూంలో నన్ను పట్టుకుంది. అలా దొరికిపోవడంతో ఒక వారం పాటు నేను తరగతిగదిలో బల్లలన్నీ తుడవాల్సి వచ్చింది. వారం పాటు తరగతిలో బల్లలు తుడవడం అంటే మాటలు కాదు. ఇది చాలా కష్టం. కాబట్టి ఎవరూ తరగతి గదిలో నిద్రపోకూడదు. కావాలంటే ఇంట్లో నిద్రపోండి'' అంటూ బాలల దినోత్సవం సందర్భంగా ముంబయిలోని ఒక ఫౌండేషన్లోని పిల్లలతో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది ఆలియా. తన వయసు ఎంతైనప్పటికీ.. ఇప్పటికీ చిన్న పిల్లనే అని.. అందుకే బాలల దినోత్సవం జరుపుకోవడానికి వచ్చానని.. ఇకపై ప్రతి ఏడాది ఈ వేడుకల్లో పాల్గొంటానని ఆలియా చెప్పింది.

No comments:
Post a Comment